కర్నూలు(సెంట్రల్): అక్టోబర్ 1వ తేదీన యథావిధిగా పెన్షన్ల పంపిణీ చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి మంగళవారం ఓ ప్రకటనలో అధికారులను ఆదేశించారు. ముందుగా బ్యాంకు స మ్మె కారణంగా మధ్యాహ్నం 1 గంట నుంచి పెన్షన్లను పంపిణీ చేసేలా ఆదేశాలు ఇచ్చామన్నారు. అయితే బ్యాంకుల సమ్మె విరమించుకోవడంతో యథావిధిగా ఉదయం 6.30 గంటలకు లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయాలన్నారు.
మధ్యాహ్న భోజనంలో
మెనూ అమలు చేయాలి
కల్లూరు: ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం వడ్డించాలని డీఈఓ సుధాకర్, ఏపీసీ లోకరాజు నిర్వాహకులకు సూచించారు. మంగళవారం కల్లూరు మండలం చిన్నటేకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న ఎస్‌ఎంసీ ఎన్నికలను పరిశీలించారు. అనంతరం వారు పాఠశాలలో విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనం, గుడ్డు పరిమాణాన్ని పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు రోజు మెనూ పర్యవేక్షించాలన్నారు.


