జిల్లాకు నలుగురు సివిల్‌ జడ్జీల నియామకం | - | Sakshi
Sakshi News home page

జిల్లాకు నలుగురు సివిల్‌ జడ్జీల నియామకం

Sep 30 2026 1:58 AM | Updated on Sep 30 2026 1:58 AM

● ప్రమాణం చేయించిన

జిల్లా ప్రధాన న్యాయమూర్తి

కర్నూలు: ఉమ్మడి కర్నూలు జిల్లాలోని వివిధ న్యాయస్థానాలకు నలుగురు సివిల్‌ జడ్జీలను(జూనియర్‌ డివిజన్‌) హైకోర్టు నియమించింది. నంద్యాల 2వ అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జిగా తురిమెళ్ల సుష్మ, నంద్యాల 3వ అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జిగా మోహనలక్ష్మి, నంద్యాల 4వ అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జిగా సయ్యద్‌ మునీరా, నందికొట్కూరు అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జిగా షేక్‌ రేష్మాను నియమిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వీరు మంగళవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి వాసు సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా నియమితులైన అదనపు సివిల్‌ జడ్జీల చేత కర్నూలు ప్రిన్సిపల్‌ జిల్లా జడ్జి ప్రమాణం చేయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు పైన పేర్కొన్న సివిల్‌ జడ్జీలు గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీ జ్యూడీషియల్‌ అకాడమీలో సంవత్సరం పాటు ప్రాథమిక శిక్షణ (సంస్థాగత, ఆచరణాత్మక శిక్షణ) పొందేందుకు నామినేట్‌ అయినందున విధుల నుంచి రిలీవ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement