ఖరీఫ్‌లో పది ఎకరాల్లో
పత్తి సాగు చేశాం. విత్తనం చేసినప్పటి నుంచి చినుకు జాడ లేదు. ఎకరాకు రూ.15,000 పెట్టుబడి పెట్టి నష్టపోయాం. రబీలో ఎనిమిది ఎకరాల్లో పప్పుశనగ, రెండు ఎకరాల్లో జొన్న సాగు చేయాలనుకున్నాం. ఇప్పటి వరకు విత్తనాలు ఇవ్వక ఇబ్బంది పడుతున్నాం. ఇప్పటికై నా ప్రభుత్వం చొరవ తీసుకొని 80 శాతం సబ్సిడీపై విత్తనాలు ఇవ్వాలి.
– నారాయణ, హెబ్బటం, హొళగుంద మండలం
ఖరీఫ్ సీజన్‌లో ఐదు ఎకరాల్లో ఉల్లి సాగు చేశాం. వర్షాలే లేకపోవడంతో పంటను దున్నేశాం. ఎకరాకు రూ.75 వేల పెట్టుబడి పెట్టి నష్టపోయాం. దున్నేసిన పొలంలో పప్పుశనగ, జొన్న వేయాలనుకున్నాం. విత్తనం అందుబాటులో లేకపోవడంతో దిక్కులు చూడాల్సి వస్తోంది. ఇటీవల కొంతమేరకు వర్షాలు కురిశాయి.విత్తనం లేకపోవడంతో దిక్కులు చూడాల్సి వస్తోంది. ఖరీఫ్‌లో పంటలు పండని రైతులకు రబీలో 100 శాతం సబ్సిడీపై విత్తనాలు ఇవ్వాలి.
– సురేంద్ర, రాతన, తుగ్గలి మండలం
ప్రత్యామ్నాయ పంటలకు, రబీ పంటల సాగు కోసం విత్తనాలు సిద్ధం చేస్తున్నాం. శనగ విత్తనాలు 55 వేల క్వింటాళ్లు అడిగాం. ప్రస్తుతానికి 25 వేల క్వింటాళ్లు ఇచ్చారు. అవసరమైన మేరకు విత్తనాలు ఇస్తామని వ్యవసాయ శాఖ కమిషనర్ చెప్పారు. విత్తనాల గురించి రైతులకు ఆందోళన అవసరం లేదు. ముఖ్యంగా శనగ విత్తనాలు పొజిషన్ చేయాలని ఏపీ సీడ్స్ అధికారులకు ఆదేశాలు ఇచ్చాం.
– పీఎల్ వరలక్ష్మి,
జిల్లా వ్యవసాయాధికారి, కర్నూలు


