నూతన కోర్టు భవనాల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

నూతన కోర్టు భవనాల పరిశీలన

Sep 29 2026 12:51 AM | Updated on Sep 29 2026 12:51 AM

కర్నూలు: నూతనంగా ఏర్పాటు చేయనున్న 8వ అదనపు జిల్లా కోర్టు, మరో రెండు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు భవనాలను జిల్లా ఇన్‌చార్జ్‌ ప్రధాన న్యాయమూర్తి, ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి పి.వాసు పరిశీలించారు. కొత్తపేట రైతుబజార్‌ పక్కన ఉన్న సచివాలయ భవనాల్లో కొత్త కోర్టులు ఏర్పాటు కోసం రెండు నెలలుగా పనులు జరుగుతున్నాయి. పూర్తి కావచ్చిన పనులను సోమవారం ఆయన పరిశీలించారు. త్వరలో నూతనంగా కోర్టులను ప్రారంభం చేయనున్నట్లు తెలిపారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు చంద్రుడు, ఉపాధ్యక్షుడు రసూల్‌ ఖాన్‌, సీనియర్‌ న్యాయవాదులు ఓంకార్‌, నాగశేషయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement