గోరుకల్లును వెంటాడుతున్న భయం | - | Sakshi
Sakshi News home page

గోరుకల్లును వెంటాడుతున్న భయం

Sep 24 2026 1:54 AM | Updated on Sep 24 2026 1:54 AM

● రిజర్వాయర్‌ నిండిందని పుకార్లు ● ప్రాణ భయంతో ఊరు వదిలేందుకు సిద్ధమైన ప్రజలు ● ఎస్‌ఐ నచ్చజెప్పడంతో ఇళ్లకు చేరుకున్న వైనం

● రిజర్వాయర్‌ నిండిందని పుకార్లు ● ప్రాణ భయంతో ఊరు వదిలేందుకు సిద్ధమైన ప్రజలు ● ఎస్‌ఐ నచ్చజెప్పడంతో ఇళ్లకు చేరుకున్న వైనం

పాణ్యం: జలాశయం నిండిందని ఏ క్షణమైనా నీళ్లు ఊరిలోకి వచ్చే ప్రమాదముందని ఆకతాయిలు చేసిన పుకార్లు గోరుకల్లు గ్రామస్తులను భయాందోళనకు గురి చేశాయి. దీంతో కొందరు బుధవారం సాయంత్రం నుంచే సమీపంలోని వేణుగోపాల స్వామి కొండపైకి చేరుకోవడం మొదలు పెట్టారు. పుకార్లు షికార్లు కావడంతో గ్రామస్తులు ఒకరికి ఒకరు చర్చించుకుని కొండపై చేరుకున్నారు. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో గడివేముల ఎస్‌ఐ నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో రాత్రి గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. ఎలాంటి అపోహలు నమ్మొద్దని యంత్రాంగం అందుబాటులో ఉందన్నారు. అవసరమైతే ఇంజనీర్లు, పోలీసులు ఇతరశాఖాధికారులు గ్రామంలోనే బసచేస్తామ ని అపోహలు వీడాలన్నారు. దాదాపు గంట పాటు ప్రజలకు ఎస్‌ఐ నచ్చజెప్పారు. కొండదిగి ఇళ్లకు వెళ్లాలని కోరారు. దీంతో కొండ ఎక్కినవారు కిందకు దిగి ఇళ్లకు చేరుకున్నారు. ఈ విషయంపై ఈఈ భవాని ప్రసాద్‌రెడ్డి వివరణ కోరగా.. గోరుకల్లు జలాశయానికి ఎలాంటి ప్రమాదం లేదన్నారు. జలాశయంలో 9.6 టీఎంసీల నీరు నిల్వ ఉండగా గాలేరుకు 4 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నామన్నారు. బానకచెర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌ నుంచి 3 వేల క్యూసెక్కులు నీరు చేరుతుందన్నారు. ప్రజలు నిచ్చింతగా ఉండవచ్చని, అసత్య ప్రచారాలు, అపోహలు నమ్మరాదన్నారు. జలాశయాన్ని నిత్యం పర్యవేక్షించేందుకు సిబ్బంది అందుబాటులో ఉన్నారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement