ఫీజు బకాయిలపై ఇంత తాత్సారమా ! | - | Sakshi
Sakshi News home page

ఫీజు బకాయిలపై ఇంత తాత్సారమా !

Sep 24 2026 1:54 AM | Updated on Sep 24 2026 1:54 AM

● ఆర్థికభారంతో ఉన్నత విద్యకు దూరమవుతున్న పేద వర్గాలు ● వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి కటారుకొండ సాయికుమార్‌ ● సీఈ కబీర్‌ బాషా

● ఆర్థికభారంతో ఉన్నత విద్యకు దూరమవుతున్న పేద వర్గాలు ● వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి కటారుకొండ సాయికుమార్‌

కర్నూలు(అర్బన్‌): పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను విడుదల చేయడంలో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం తీవ్ర తాత్సారం చేస్తోందని వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి కటారుకొండ సాయికుమార్‌ ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం స్థానిక కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికలకు ముందు విద్యార్థులకు అనేక హామీలు ఇచ్చిన కూటమి పార్టీలకు చెందిన నేతలు అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క హామీని అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, హాస్టల్‌ మెయింటెనెన్స్‌ కింద రాష్ట్రవ్యాప్తంగా రూ.10,700 కోట్లను విద్యార్థులకు చెల్లించాల్సి ఉందన్నారు. వేలాది మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ తదితర పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన విద్యార్థులు ఫీజులు చెల్లించలేక ఉన్నత విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఫీజు బకాయిలను విడుదల చేయకపోవడం వల్ల ఈ పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నా ప్రభుత్వం ఏ మాత్రం స్పందించడం లేదన్నారు. పేద విద్యార్థుల విద్యపై రాజకీయాలు చేయడం ప్రభుత్వానికి తగదన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కడుమూరు గిరీష్‌, కార్యదర్శి రంగన్న మాట్లాడుతూ.. పలు కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ఫీజులు చెల్లించే విషయంలో బాండ్లు రాసి ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నాయన్నారు.ప్రభుత్వం కార్పొరేట్‌ వ్యవస్థకు కొమ్ముకా స్తూ విద్యార్థుల సంక్షేమాన్ని గాలికి వదలేసిందన్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

బిల్లేకల్లు కొండల్లో చిరుత సంచారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement