హంద్రీనది ఉధృతికి గోరంట్ల–కొత్తపల్లె మధ్య కోతకు గురైన దారి
కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ సీజన్ ముగియనున్న సమయంలో వర్షాలు పడుతున్నాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు జిల్లా వ్యాప్తంగా 14.4 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కోడుమూరులో 62.6 మి.మీ, అత్యల్పంగా 1.0 మి.మీ వర్షం కురిసింది. కోడుమూరు, ఎమ్మిగనూరు, వెల్దుర్తి, క్రిష్ణగిరి మండలాల్లో వర్షాలు పడటం వల్ల కోడుమూరు మండలంలోని లద్దగిరి, గోరంట్ల హంద్రీకి వరద నీరు భారీగా వచ్చింది. సెప్టెంబర్ నెల సాధారణ వర్షపాతం 116.2 మి.మీ ఉండగా.. ఇప్పటి వరకు 47.6 మి.మీ వర్షపాతం నమోదైంది.


