నంద్యాల(అర్బన్): వరద ప్రభావంతో నంద్యాలలో సర్వం కోల్పోయి ని రాశ్రయులుగా మారిన వారికి డాక్టర్ వైఎస్సార్ అండగా నిలిచారు. 2007 జూన్ 21న పట్టణం వరద ముంపునకు గురై అధికంగా నష్టపోయింది. వరద తాకిడికి గురైన ప్రాంతాల్లో జూన్ 24న వైఎస్సార్ స్వయంగా పర్యటించి, బాధితులను పరామర్శి ంచారు. ప్రజల కష్టాన్ని కళ్లారా చూసి న వైఎస్సార్ వరద ముప్పు నుంచి కాపాడతానని హామీ ఇచ్చారు. ఆ మేరకు శ్యామ కాలువ, కుందూ నది,మద్దిలేరును వెడల్పు చేసి వరద ముప్పు తప్పించడానికి రూ.92 కోట్లను మంజూరు చేశారు. వైఎస్ నగర్, పీవీ నగర్‌లలో తాగునీటి సౌకర్యం, రోడ్లు, డ్రె యిన్లకు రూ.3.62 కోట్లను మంజూరు చేశారు. ఆయ న హయాంలో నంద్యాల నియోజకవర్గంలో దాదాపు రూ.250 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు.


