సి.బెళగల్: మండలంలోని తుంగభద్ర నది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్‌ఐ వేణుగోపాల్‌రాజు తెలిపారు. మంగళవారం రాత్రి పోలీస్ సిబ్బందితో మండలంలో నది తీర గ్రామాల్లో గస్తీ నిర్వహిస్తుండగా తిమ్మందొడ్డి నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకున్నామన్నారు. ఈ మేరకు ఇసుక అక్రమ రవాణాపై కేసు నమోదు చేసి, ట్రాక్టర్లను సీజ్ చేసి, రెవెన్యూ అధికారులకు అప్పగిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఇసుకను అక్రమంగా రవాణ చేసే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయన్నారు.
డ్రంకెన్ డ్రైవ్ చేసిన
నలుగురికి జైలు
డోన్ టౌన్: మద్యం తాగి వాహనాలు నడిపిన నలుగురు వ్యక్తులకు జడ్జి నూరుల్లా జైలు శిక్ష లు విధించినట్లు సీఐ ఇంతియాజ్‌బాషా తెలిపారు. పట్టణంలోని కొండపేటకు చెందిన చాక లి తిరుమలేసుకు నాలుగు రోజులు, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి నగర్‌కు చెందిన నీలకంఠ, కొండపేటకు చెందిన ఈడిగ వెంకటేశ్వర్లు, డోన్ మండలం తాడూరు గ్రామానికి చెందిన దస్తగిరికి రెండు రోజుల పాటు జైలు శిక్ష విధించిన ట్లు సీఐ చెప్పారు. మద్యం తాగి వాహనాలు నడిపితే వారి ప్రాణాలతో పాటు అమాయక ప్రజల ప్రాణాలకు హాని కలుగుతుందని అన్నారు.
పేకాట రాయుళ్ల అరెస్ట్
చిప్పగిరి: ఖాజీపురం కొట్టాల శివారు ప్రాంతంలో పేకాట ఆడుతున్న ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్‌ఐ సీవీ నరసిహులు తెలిపిన వివరాల మేరకు.. గుట్టుగా పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎస్‌ఐ బుధవారం మధ్యాహ్నం సిబ్బందితో వెళ్లి దాడి చేశారు. పేకాట రాయుళ్లలో ఆరుగురు వ్యక్తులు, ఓ మహిళ ఉన్నారు. వారి వద్ద నుంచి రూ 32,250 నగదు, నాలుగు ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
వేలాడుతున్న తీగలను సరి చేసేందుకు వెళ్లి..
● విద్యుదాఘాతంతో యువకుడి మృతి
ఎమ్మిగనూరురూరల్: విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి చెందా డు. కలుగొట్ల గ్రామానికి చెందిన ఎం.కృష్ణ (28) ప్రైవేట్ ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తున్నాడు. కె. నాగలాపురం గ్రామానికి చెందిన రైతు కుమ్మరి నరసింహులకు చెందిన పొలం విద్యుత్ తీగలు కిందకు వేలాడుతుండటంతో మరమ్మతుల కోసం కృష్ణను తీసుకెళ్లాడు. విద్యుత్ స్తంభంపై ఎక్కిన యువకుడు ప్రమాదవశాత్తు పక్కన ఉన్న మరో తీగను తాకడంతో విద్యుదాఘాతానికి గురై కిందపడ్డాడు. వెంటనే స్థానికులు చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు జయకుమార్ (8), దేవాన్ష్ (2) ఉన్నారు. కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.


