● ఎండిన తెలుగు గంగ
● బాబు సర్కార్ నిర్లక్ష్యమే కారణమంటూ
రైతుల మండిపాటు
మహానంది: వర్షాకాలం వస్తే జలసవ్వడులతో కళకళలాడాల్సిన తెలుగుగంగ కాలువ నీళ్లు లేక వెలవెలబోతోంది. శ్రీశైలం నియోజకవర్గంలో ఉన్న తెలుగుగంగ కాలువ కింద సుమారు 60 వేల ఎకరాల పంట భూములున్నాయి. శ్రీశైలం రిజర్వాయర్‌లో నీళ్లున్నా చంద్రబాబు ప్రభుత్వం చుక్క నీరు కూడా విడుదల చేయకపోవడంతో కాలువ పూర్తిగా ఎండిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఎన్నో ఆశలతో మొదలుపెట్టిన పంటలు కూడా పూర్తిగా ఎండిపోయే దుస్థితి తలెత్తిందని వాపోయారు. ప్రభుత్వం వెంటనే నీటిని విడుదల చేసి.. ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.


