కర్నూలు(హాస్పిటల్): నగరంలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లో ఆయుర్వేద వైద్యాధికారిగా డాక్టర్ గ్రేస్ సెలెస్టియల్ విధుల్లో చేరారు. డోన్ మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఆమెకు శుక్ర, శనివా రాల్లో కర్నూలులో విధులు నిర్వహించేలా ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కర్నూ లు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని టీబీ వార్డు పక్కనున్న ఆయుష్ విభాగం ప్రస్తుతం వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం పక్కన ఉ న్న ప్రాంతీయ శిక్ష ణ కేంద్రం(మేల్) ఆవరణలోకి మా ర్చారు. ఇటీవలే ఈ డిస్పెన్సరీని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌గా అప్ గ్రేడ్ చే శారు. అయితే, ఇందులో గత రెండేళ్లు గా ఆయుర్వేద వైద్యాధికారి పోస్టు ఖాళీ గా ఉంది. ఈ విషయమై సాక్షి ఇటీ వల కథనం ప్రచురించింది. ఇక్కడి కాంపౌండరే రోగులకు అవసరమైన మందులు ఇచ్చి పంపిస్తున్నారు. ఈ క్రమంలో డాక్టర్ గ్రేస్‌ను వారంలో రెండు రోజుల పాటు విధులు నిర్వహించే లా ఆదేశాలు అందటం విశేషం.


