క్రీడల్లో ప్రతిభ కనబరిచి రేంజ్‌కు మంచి పేరు తేవాలి | - | Sakshi
Sakshi News home page

క్రీడల్లో ప్రతిభ కనబరిచి రేంజ్‌కు మంచి పేరు తేవాలి

Aug 30 2026 1:51 AM | Updated on Aug 30 2026 1:51 AM

కర్నూలు: క్రీడల్లో ప్రతిభ కనబరచి కర్నూలు రేంజ్‌కు మంచి పేరు తీసుకురావాలని డీఐజీ డాక్టర్‌ కోయ ప్రవీణ్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ స్పోర్ట్స్‌ మీట్‌ గుంటూరులో సెప్టెంబర్‌ 1 నుంచి 4వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న నేపథ్యంలో కర్నూలు రేంజ్‌ నుంచి పాల్గొనే పోలీసు అధికారులు, సిబ్బందికి డీఐజీ శనివారం తన కార్యాలయంలో స్పోర్ట్స్‌ కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా పోలీసు క్రీడాకారులను డీఐజీ అభినందించారు. క్రీడలు పోలీసు సిబ్బందిలో మానసిక ఉల్లాసాన్ని, క్రమశిక్షణను పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తాయన్నారు. ఏపీ పోలీస్‌ స్పోర్ట్స్‌ మీట్‌లో కర్నూలు రేంజ్‌కు చెందిన పోలీసు అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని సూచించారు. సీఐలు చంద్రబాబు నాయుడు, తేజమూర్తి, తిక్కస్వామి, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐల, స్పోర్ట్స్‌ మీట్‌కు ఎంపికై న పోలీసు సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement