మంత్రాలయం తూర్పు దిశగా తుంగభద్ర నదిలో ఇసుకను తోడుతున్నారు. పగలూ రాత్రి తేడా లేకుండా ట్రాక్టర్లతో తరలిస్తున్నారు. దాదాపు 20 ట్రాక్టర్లు ఇక్కడ నడుస్తున్నాయి. స్థానికంగా ఇసుక రీచ్ ఉందేమో అన్నంతగా ఇసుకను రవాణా చేస్తున్నారు. యథేచ్ఛగా ఇసుకను తరలించి తమ దర్జాను చాటుకుంటున్నారు. స్థానికంగా ట్రిప్పు ఇసుక రూ.1200కు విక్రయిస్తుండగా చిలకలడోణ, కల్లుదేవకుంట, వగరూరు, రచ్చమర్రి ప్రాంతాల్లో రూ.2,500కు అమ్ముతున్నారు. ఎమ్మిగనూరులో రూ.3,500 టిప్పు చొప్పున ఇస్తున్నారు. ఇక్కడి నుంచి రోజుకు 100 ట్రిప్పులకు పైగా ఇసుకను తోడుతున్నారు. ఇసుక తవ్వకాలతో నదిలో పెద్దపెద్ద గోతులు ఏర్పడ్డాయి.


