మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేయాలి | - | Sakshi
Sakshi News home page

మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేయాలి

Aug 8 2026 1:53 AM | Updated on Aug 8 2026 1:53 AM

కర్నూలు(టౌన్‌): డీఎస్సీలో అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేయాలని యువకులు, నిరుద్యోగులు డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు శుక్రవారం ఉధృతంగా కొనసాగాయి. పెద్ద సంఖ్యలో యువకులు పాల్గొన్నారు. నిరుద్యోగులను మోసం చేసిన ప్రభుత్వం డౌన్‌, డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. రిలే దీక్షల్లో పత్తికొండ, ఆదోనికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు కంగాటి శ్రీదేవి, సాయిప్రసాద్‌ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్‌ మధుసూదన్‌, కర్నూలు పార్లమెంటరీ ఇన్‌చార్జ్‌ బుట్టా రేణుక, కోడుమూరు, ఎమ్మిగనూరు పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ డీఎస్సీ పరీక్షల్లో తాము మోసపోయామని నిరుద్యోగులు ఆందోళనలు చేశారని, కొంత మంది కోర్టును ఆశ్రయించారన్నారు. అయినా చంద్రబాబు ప్రభుత్వం కనీసం విచారణకు ఆదేశించకపోవడం దారుణమన్నారు. తప్పు చేయకుంటే ఎందుకు డీఎస్సీలో జీవోలు పదేపదే మార్చారని ప్రశ్నించారు. ఢిల్లీలో విద్యార్థుల ఉద్యమానికి కేంద్ర మంత్రి రాజీనామా చేశారని, ఆంధ్రప్రదేశ్‌లో కూడా మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేయాలన్నారు. విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు, డీఎస్సీ నిరుద్యోగ అభ్యర్థులతో కలిసి ఉద్యమాలను ఉధృతం చేస్తామన్నారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేయ్యలేదా అని ప్రశ్నించారు. రెండేళ్లు దాటినా నిరుద్యోగ భృతి ఇవ్వకుండా నిరుద్యోగులను దగా చేశారన్నారు. ఫీజురీయింబర్స్‌మెంట్‌ నిధులు రాక విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు కనిపించడం లేదా అన్నారు. నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న ప్రభుత్వంపై పోరాటం చేసి సమస్యలు పరిష్కరించుకుంటామన్నారు.

● కర్నూలులోని ధర్నా చౌక్‌లో వైఎస్సార్‌సీపీ యువజన విభాగం అధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు కొనసాగాయి. మహిళ జిల్లా అధ్యక్షురాలు సిద్ధారెడ్డి రేణుక, పార్టీ రాష్ట్ర కార్యదర్శి సిట్రా సత్యనారాయణమ్మ, కురువ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం రామక్రిష్ణ, యువజన విభాగం అధ్యక్షుడు శివారెడ్డి, కర్నూలు నగర అధ్యక్షుడు బాలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

● ఆదోనిలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త సాయి ప్రసాద్‌ రెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. ఎమ్మెల్సీ డాక్టర్‌ మధుసూదన్‌, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రకాంత్‌ రెడ్డి, రాష్ట్ర లీగల్‌ సెల్‌ అధికార ప్రతినిధి తబ్రేజ్‌, కార్యదర్శి జీవన్‌ సింగ్‌, మాజీ కౌన్సిలర్‌ రామలింగేశ్వర యాదవ్‌ పాల్గొన్నారు.

● కోడుమూరు పాతబస్టాండ్‌ సెంటర్‌లో సమన్వయకర్త డాక్టర్‌ ఆదిమూలపు సతీష్‌ ఆధ్వర్యంలో దీక్షలు నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ కర్నూలు పార్లమెంటరీ సమన్వయకర్త బుట్టా రేణుక, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుట్టా ప్రతుల్‌, జెడ్పీటీసీ సభ్యుడు రఘనాథ రెడ్డి, యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు సోమశేఖర్‌ రెడ్డి, నియోజకవర్గ అధ్యక్షుడు వెంకటేష్‌ పాల్గొన్నారు.

● ఎమ్మిగనూరు సోమప్ప సర్కిల్‌ వద్ద సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్‌ రెడ్డి ఆధ్వర్యంలో రెండో రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. పార్టీ సీనియర్‌ నాయకులు రియాజ్‌ అహమ్మద్‌, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ బుట్టా రంగయ్య, చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి మాచాని వెంకటేశ్వర్లు, మాజీ మున్సిపల్‌ కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, వార్డు ఇన్‌చార్జ్‌లు పాల్గొన్నారు.

● పత్తికొండలో ఊరు వాకిలి వద్ద మాజీ ఎమ్మెల్యే , పార్టీ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి ఆధ్వర్యంలో రెండో రోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. దీక్షలకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రామచంద్రయ్య సంఘీభావం తెలిపారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెరుకుల పాడు ప్రదీప్‌ రెడ్డి, క్రిష్ణగిరి, పత్తికొండ మండలాల అధ్యక్షులు కంగాటి వెంకటరామిరెడ్డి, నారాయణ దాసు, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు.

● మంత్రాలయంలోని రాఘవేంద్ర సర్కిల్‌లో వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి విశ్వనాథ్‌ రెడ్డి అధ్వర్యంలో రెండో రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి.

జిల్లా వ్యాప్తంగా రెండో రోజు

కొనసాగిన వైఎస్సార్‌సీపీ

రిలే నిరాహారదీక్షలు

పాల్గొన్న మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ,

నియోజకవర్గ సమన్వయకర్తలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement