ఆత్మకూరు రూరల్: ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని నాగలూటి రేంజ్‌లో పెద్దపులి(టి66ఎఫ్) మరణానికి ముళ్ల పందితో పోరాటమే కారణమని డిప్యూటీ డైరెక్టర్ విగ్నేష్ అపావ్ తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ కూడా ఈ విషయాన్ని నిర్ధారించిందన్నారు. టి66 ఎఫ్ పులి ముళ్ల పందిని వేటాడే క్రమంలో తీవ్రంగా గాయపడిందన్నారు. పులి సంచరించిన ప్రదేశాల్లో ఇన్‌ఫ్రారెడ్ కెమెరాలు పరిశీలించినప్పుడు ఈ విషయం వెల్లడైందన్నారు.పులి కళేబరానికి పోస్ట్‌మార్టం చేసినప్పుడు కడుపులో ముళ్ల పంది ముళ్లు కనిపించినట్లు పేర్కొన్నారు.


