సోలార్ పవర్ కోసం 5 ఎకరాల భూమిని తీసుకున్నారు. లీజు సమయంలో మార్టిగేజ్ లేదా ఇతర సంస్థలకు బదిలీ చేసే అవకాశం ఉందన్న నిబంధనను ఎవరూ చెప్పలేదు. ఈ నిబంధనను తొలగించకపోతే నష్టపోతాం. భవిష్యత్‌లో కంపెనీ నష్టాల బాటలో ఉంటే అది చేసిన అప్పులకు మా భూములను బ్యాంకులు వేలం వేస్తాయి. అప్పుడు మా పరిస్థితి ఏంటి.
– బంగారు బజారప్ప,
రైతు, జోహరాపురం, ఆస్పరి మండలం
పత్తికొండ మండలం హోసూరులో టాటా పవర్ రెన్యువబుల్ ఎనర్జీ లిమిటెడ్ కంపెనీ సోలార్ ప్రాజెక్టు ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఇందుకోసం రైతుల నుంచి 29 సంవత్సరాల 11 నెలల కాలానికి భూములను లీజుకు తీసుకుంటూ ఒప్పందం చేసుకుంది. ఎకరాకు ఏడాదికి రూ.31 వేలు చెల్లిస్తారు. ఆ తరువాత ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి అద్దెను 5 శాతం పెంచుతారు. రైతుల నుంచి తీసుకున్న పొలాలను మార్టిగేజ్ లేదా ఇతర సంస్థలకు బదలాయించే అధికారం కంపెనీకి ఉంటుంది.
– నూరుల్ ఖమర్, జేసీ, కర్నూలు
●


