నంద్యాల(అర్బన్): ప్రసిద్ధ గాయని ఎస్.జానకి మృతిని స్మరించుకుంటూ నంద్యాలకు చెందిన చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ అక్షర నివాళిలర్పించారు. డ్రాయింగ్ షీట్ మీద ఎటువంటి గీతలు లేకుండా మైక్రో పెన్ను, జెల్ పెన్నుతో ఆమె పాడిన పాటల పల్లవులతో ఆమె చిత్రాన్ని గీసి ఆమె జీవిత చరిత్రను తెలుగు అక్షరాలతో రాసి చిత్ర నివాళులు అర్పించారు. ఆమె స్వరంలో ప్రేమ, విషాదం, జానపదం, భక్తి, క్లాసికల్ మెలోడీ ఇలా అన్ని రకాల పాటలకు తన గాత్రంతో రంజిప చేశారన్నారు. అన్ని భాషల్లో పాటలు పాడి ప్రజలను మైమరిపించి కానరాని లోకానికి వెళ్లారని చిత్రకారుడు కోటేష్ అన్నారు.


