ఓటరు జాబితా ధ్రువీకరణలో భాగస్వాములవుదాం | - | Sakshi
Sakshi News home page

ఓటరు జాబితా ధ్రువీకరణలో భాగస్వాములవుదాం

Jul 5 2026 2:18 AM | Updated on Jul 5 2026 2:18 AM

● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి

● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి

కర్నూలు(టౌన్‌): ప్రతీ ఓటరు బాధ్యతాయుతంగా వ్యవహరించి ఓటరు జాబితా ధ్రువీకరణ ప్రక్రియ లో భాగస్వాములు కావాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు. శనివారం కర్నూలు నియోజకవర్గంలోని 2వ వార్డు సుభేదారి వీధి, పెద్దమార్కెట్‌ ప్రాంతాల్లో ఓటర్లతో మాట్లాడి అవగాహన కల్పించారు. ఎన్యూమరేషన్‌ ఫారాల నమోదు ప్రక్రియను పరిశీలించారు. అర్హత కలిగిన ప్రతీ ఓటరు తమ పేరు ఓటరు జాబితాలో సక్రమంగా నమోదు అయిందో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాలన్నారు. ఎస్‌ఐఆర్‌ కార్యక్రమం ద్వారా ఓటరు జాబితాను మరింత పారదర్శకంగా రూపొందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈనెల 14 వరకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రతి పోలింగ్‌ బూత్‌ పరిధిలో ఓటర్లు తప్పనిసరిగా తమ ఓట్లను పరిశీలించుకోవాలన్నారు. తప్పనిసరిగా ఎన్యూమరేషన్‌ ఫారాలు పూరించి బూత్‌లెవల్‌ అధికారులకు అందజేయాలన్నారు. రెండు రోజులు పాటు బీఎల్‌ఓలు ఇంటింటికి వచ్చి ఎన్యూమరేషన్‌ ఫారాలు ఇచ్చి పూరించిన తరువాత డిజిటలైజేషన్‌ చేస్తారన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, బూత్‌స్థాయి ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement