‘సర్‌’కొత్త కష్టాలు! | - | Sakshi
Sakshi News home page

‘సర్‌’కొత్త కష్టాలు!

Jul 5 2026 2:18 AM | Updated on Jul 5 2026 2:18 AM

నాకు ఇంత వరకు ఎన్యుమరేషన్‌ ఫారం ఇవ్వలేదు 2002 ఓటరు జాబితా వివరాలు కావాలని అడిగారు

జిల్లాలో 46,933 మందికి అందని ఎన్యుమరేషన్‌ ఫారాలు

గడువు సమీపిస్తుండడంతో ఓట్లను తొలగిస్తారేమోనని ఆందోళన

2002 ఓటరు జాబితా వివరాలు దొరక్క ఇబ్బందులు

శనివారం ఎక్కడా కనిపించని ప్రత్యేక క్యాంపులు

కర్నూలు(సెంట్రల్‌): ఓటర్లకు స్పెషల్‌ ఇన్సెంటివ్‌ రివిజన్‌(ఎస్‌ఐఆర్‌) సరికొత్త కష్టాలను తెచ్చి పెట్టింది. కర్నూలు జిల్లాలో ఇప్పటి వరకు 46,933 మంది ఓటర్లకు బీఎల్‌ఓలు ఫారాలు ఇవ్వలేదు. గడువు సమీపిస్తుండడంతో తమ ఓటును ఎక్కడ తొలగిస్తారేమోన ని ఓటర్లు భయాందోళనలో ఉన్నారు. ఇందులో వలస వెళ్లిన వారు అధికంగా ఉన్నారు. ఇప్పటి వరకు వీరికి బీఎల్‌ఓలు ఫోన్‌ చేయడంగాని, నేరుగా కలుసుకోవడానికిగాని ప్రయత్నించడంలేదు. కర్నూలు జిల్లాలో మొ త్తం ఓటర్లు 20,86,119 మంది ఉన్నారు. వీరిలో ఇప్ప టి వరకు 20,39,186 మందికి ఎన్యుమరేషన్‌ ఫారాలు ఇచ్చారు. ఫారాలు అందక మిగిలిన 46,933 మంది ఆ ందోళనలో ఉన్నారు.తమకు ఎన్యుమరేషన్‌ ఫారాలు ఎప్పుడుఇస్తారని ప్రశ్నిస్తున్నారు.అయితే వారికి సమా ధానం చెప్పే వారు కరువయ్యారు.ఈ క్రమంలో అస లువారికి ఎన్యుమరేషన్‌ ఫారాలు వచ్చాయా లేదా అ న్న విషయాన్ని బీఎల్‌ఓలు స్పష్టం చేయాల్సి ఉంది. వ చ్చిఉంటే వెంటనే పంపిణీ చేయాలని,రాకపోతే త రు వాత వారిఓటు జాబితా నుంచి తొలగి పోకుండా ఏమి చేయాలో చెప్పితే ఓటర్లలో ఆందోళన తగ్గుతుంది.

2025 ఓటరు జాబితాలో వలస

ఓటర్ల వివరాలు మాయం

కర్నూలు జిల్లాలో జనవరి వచ్చిందంటే ఎక్కువగా గుంటూరు, హైదరాబాద్‌, బెంగళూరు ప్రాంతాలకు వలస వెళ్తుంటారు. పొలాల్లో పనులు లేకపోతే పది రోజులైనా వెళ్లి ఆయా ప్రాంతాల్లోనే ఉండి పనిచేసుకొని వస్తుంటారు. అయితే 2024 ఎన్నికల తరువాత చేపట్టిన ఎస్‌ఎస్‌ఆర్‌లో చాలా మంది వలసదారుల ఓటర్లను జాబితాల నుంచి తొలగించారు. దీంతో వారికి ఎన్యుమరేషన్‌ ఫారాలు ఇవ్వలేకపోతున్నామని కొందరు బీఎల్‌ఓలు చెబుతున్నారు. చాలా మంది చిరునామాలు దొరకడం లేదని, ఇబ్బందిగా ఉందని మరికొందరు బీఎల్‌ఓలు తెలుపుతున్నారు. వలస వెళ్లిన వారి వివరాలు తెలుసుకోవడానికి ఇంకొందరు బీఎల్‌ఓలు ప్రయత్నం చేస్తున్నారు.

పత్తాలేని ప్రత్యేక క్యాంపులు...

ఎస్‌ఐఆర్‌లో భాగంగా బీఎల్‌ఓలు ఓటర్లు ఇంటింటికీ తిరిగే సమయం దగ్గర పడుతుండడంతో ప్రక్రి యను వేగవంతం చేయడానికి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.సిరి ప్రత్యేక చర్యలు చేపట్టారు. శని, ఆదివారాల్లో ప్రతి పోలింగ్‌ బూత్‌లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని ఆదేశించారు. అయితే అన్ని పోలింగ్‌ బూ తుల్లో శనివారం పాఠశాలలు, కళాశాలలు నడవడంతో ప్రత్యేక క్యాంపులు పత్తా లేకుండాపోయాయి. అయితే తూతూమంత్రంగా ఆయా పోలింగ్‌ బూతుల పరిధిలో కొందరు బీఓల్‌ఓలు పర్యటించి ఇదే ప్రత్యేక క్యాంపు అని చెప్పుకోవడం విశేషం.

నేను మాంటిస్సోరి స్కూలు పక్కన ఉన్న అపార్టుమెంట్‌లో నివాసం ఉంటాను. 2024 ఎన్నికల్లో మాంటిస్సోరి పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూతులో ఓటు వేశాను. ఇప్పుడు నాకు ఎవరు ఎన్యుమరేషన్‌ ఫారం ఇవ్వలేదు. కనీసం ఫోన్‌ చేయలేదు. బీఎల్‌ఓ ఎవరూ మా ఇంటికి రాలేదు. ఏమి చేయాలో అర్థం కావడం లేదు.

– పీహెచ్‌సీ సునీల్‌కుమార్‌, కర్నూలు

నేను ఎన్యుమరేషన్‌ ఫారాన్ని పూరించుకొని తీసుకెళ్లి బీఎల్‌ఓకు ఇస్తే 2002 ఓటరు జాబితా వివరాలు తేవాలని అడిగారు. అప్పుడు నాకు ఓటు లేదు. మా తల్లిదండ్రుల ఓటు వివరాలు కూడా అందులో లేవు. దీంతో కచ్చితంగా 2002 జాబితా వివరాలు తీసుకొని రావాలని బీఎల్‌ఓలు చెప్పారు. వాళ్ల దగ్గరే లేకపోతే నేను ఎక్కడి నుంచి తేవాలి. తేవాలని ప్రశ్నించినా ఎక్కడా దొరకడంలేదు. అధికారులు స్పందించి నా ఫారాన్ని స్వీకరించాలి.

– బాలరంగడు, తిప్పాయపల్లె, ఓర్వకల్లు మండలం

సమస్యలొస్తే ఆత్మస్థైర్యం కోల్పోకూడదు

కర్నూలు సిటీ: ఏదైనా సమస్య వస్తే ఆత్మస్థ్యైరం కోల్పోకూడదని జిల్లా బాలల సంరక్షణ ఆధికారి టి.శారద అన్నారు. శనివారం నగరంలోని ప్రభుత్వ(టౌన్‌ మోడల్‌) ఉన్నత పాఠశాలలో పిల్లలకు, మహిళలకు ఆత్మహత్యల నివారణ, నషముక్త్‌ భారత్‌ అభియాన్‌పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ఎంతటి సమస్యనైనా నిర్భయంగా ఎదుర్కొని నిలబడే శక్తి మహిళలకు ఉండాలన్నారు. పిల్లలు మత్తు పదార్థాలకు అలవాటు పడ కూడదన్నారు. అమ్మాయిలకు 18 ఏళ్లు, అబ్బాయిలకు 21 ఏళ్ల వయస్సు వచ్చేంత వరకు వివాహాలు చేయకూడదన్నారు. సమస్యలు ఎదురైనప్పుడు పరిష్కార దిశగా ప్రభుత్వ హెల్ప్‌లైన్‌ నంబర్లు 181, 1098, 100,112లకు ఫోన్‌ చేయాలన్నారు. కార్యక్రమంలో పీఏ ఐసీ పద్మ, ఎల్‌సీపీఓ శ్రీలక్ష్మీ, రంగమ్మ, ఈగల్‌ టీఎం హెడ్‌ కానిస్టేబుల్‌ ఎలీషా, బాషా తదితరులు పాల్గొన్నారు.

డిజిటై‘లేజీ’

జిల్లాలో ఎన్యుమరేషన్‌ ఫామ్‌ల డిజటలైజేషన్‌ ప్రక్రియ నెమ్మదిగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు కేవలం 43 శాతం ఎన్యుమరేషన్‌ ఫారాలను మాత్రమే ఓటర్లు బీఎల్‌ఓలకు అందించారు. ఇందుకు ప్రధాన కారణం 2002 జాబితాలో ఓటరు లేదా ఓటరు తల్లిదండ్రులు, తాత, అవ్వల వివరాలు లేకపోవడంతో పూరించిన ఎన్యుమరేషన్‌ ఫారాలను ఓటర్లు బీఎల్‌ఓలకు ఇవ్వలేకపోతున్నారు. అయితే 2002 ఓటర్ల వివరాలను కచ్చితంగా చేర్చి ఇవ్వాల్సిందేనని బీఎల్‌ఓలు చెబుతుండడంతో ఆ వివరాలు దొరక్క ఓటర్లు ఇబ్బంది పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement