ఆదోని సెంట్రల్: తమకు నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వలేదని, ఎలా బతకాలని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఆయాలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. జీతాలు ఇవ్వాలని అడిగితే మూడు నెలలకు ఒక సారి ఎప్పుడో ఇచ్చిన జీతాలను చూపుతున్నారన్నారు. ఎప్పుడో ఇస్తే అవి ఇప్పుడు ఇచ్చినట్లు ఎలా అవుతాయని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై న అధికారులు స్పందించి పెండింగో ఉన్న జీతాలను ఇవ్వాలని కోరుతున్నారు.
రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా హనుమంతురెడ్డి
కల్లూరు: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేర కు పార్టీ కేంద్ర కార్యా లయం పాణ్యం నియో జకవర్గ పరిధిలోని అక్కి మి హనుమంతురెడ్డిని పార్టీ రాష్ట్ర సంయుక్త కా ర్యదర్శిగా నియమించా రు. ఈ సందర్భంగా అక్కిమి హనుమంతురెడ్డి మాట్లాడుతూ.. పార్టీలో బాధ్యతాయుతంగా పనిచేస్తానని తెలిపారు. వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, పా ర్టీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాట సాని శివనరసింహారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రకృతి వ్యవసాయం
ఎంతో మేలు
కోడుమూరు రూరల్: రైతులకు ప్రకృతి వ్యవసాయం ఎంతో మేలు చేస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి తెలిపారు. గూడూరులో ఎరువుల అమ్మకాలను గురువారం ఆమె పరిశీలించారు. ఎరువుల అమ్మకాల్లో యాప్‌లో సాంతికేతిక సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానన్నారు. ప్రకృతి వ్యవసాయ ప్రదర్శన క్షేత్రాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయంతో భూమి సారవంతమవుతుందని, మంచి దిగుబడులు వస్తాయని తెలిపారు. జిల్లా వ్యవసాయశాఖ అధికారిణి వరలక్ష్మి, ఆర్డీఓ సందీప్‌కుమార్, గూడూరు తహసీల్దార్ వెంకటేష్ నాయక్, ఏఓ దస్తగిరిరెడ్డి పాల్గొన్నారు.
18002332447
కర్నూలు(సెంట్రల్): పీసీ అండ్ పీఎన్‌డీటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడంలో భాగంగా గర్భస్థ శిశువుల లింగ నిర్ధారణ సమాచారం ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 18002332 447కు ఫిర్యాదు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. అక్రమంగా కొన్ని హాస్పిటళ్లు, ల్యాబ్‌ల్లో లింగ నిర్ధారణలు చేస్తున్నారని, అలాంటి సమాచా రం ఉంటే చెప్పితే వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. ఆడ, మగ అనే తేడా చూడ డం మంచికాదని, ఆడైనా, మగైనా ఒక్కటే అన్న భావన ప్రజల్లో కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
28న పల్స్‌పోలియో
కర్నూలు(హాస్పిటల్): జిల్లాలో ఈ నెల 28వ తేదీన పల్స్‌పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారుల నుంచి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు ఆదేశాలు అందాయి. ఇందుకు సంబంధించి గత 5వ తేదీ నుంచే అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అలాగే 12వ తేదీన మెడికల్ ఆఫీసర్లతో సమావేశం కూడా ఏర్పాటు చేసి వారికి కార్యక్రమంపై శిక్షణ ఇవ్వనున్నారు. జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్ మీటింగ్ 22న, సిటీ/అర్బన్, మండలస్థాయి టాస్క్‌ఫోర్స్ మీ టింగ్ 24న నిర్వహించనున్నారు. బూత్‌ల వారీ గా పల్స్‌పోలియో కార్యక్రమంలో భాగంగా 28వ తేదీన ఐదేళ్లలోపు చిన్నారులకు వ్యాక్సిన్ చుక్కలు వేయనున్నారు. వైద్య సిబ్బంది ఇంటింటికి తిరిగి 29, 30వ తేదిల్లో పల్స్‌పోలియో చుక్కలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


