● పాలనా అనుమతులు మంజూరు చేసిన పాలకవర్గం
కర్నూలు(అర్బన్): జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలు, ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ప్రజలకు ఉపయోగపడే పలు రకాల మౌలిక వసతులు కల్పించేందుకు జిల్లా పరిషత్ సాధారణ నిధులు రూ.4.06 కోట్లతో 110 పనులు చేపట్టేందుకు జెడ్పీ పాలకవర్గం పాలనా అనుమతులు మంజూరు చేసింది. 2026–27 ఆర్థిక సంవత్సరంలో ఈ నిధులతో గ్రామీణ ప్రాంతాలు, ఎస్సీ, ఎస్టీల కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైన్లు, తాగునీటికి సంబంధించిన పైప్‌లైన్ల విస్తరణ, మోటార్ల రిపేరి, బోర్‌వెల్స్, అంగన్‌వాడీ భవనాల మరమ్మతులు, అసంపూర్తిగా ఉన్న భవన నిర్మాణాలను పూర్తి చేసేందుకు ఈ నిధులను వెచ్చించనున్నారు. అలాగే అసంపూర్తిగా ఉన్న గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లీనిక్స్ భవనాలను పూర్తి చేసేందుకు సెక్టోరియల్ ఆక్టివిటీస్ కింద ఈ నిధులను వినియోగించుకోనున్నారు. ఈ పనులకు సంబంధించి 1వ స్థాయీ సంఘ సమావేశంలో చర్చించి సభ్యులు ఆమోదం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 10న జరిగిన జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ఆమోదం తీసుకొని పాలనా అనుమతులు మంజూరు చేశారు.
23 శాతం జెడ్పీ నిధులతో రూ.96 లక్షలతో 21 పనులు
12 శాతం ఆర్‌డబ్ల్యూఎస్ నిధులు రూ.122.09 లక్షలతో 51 పనులు
10 శాతం సెక్టోరియల్ నిధులు రూ.69.25 లక్షలతో 16 పనులు
15 శాతం ఎస్‌సీ ఈఎంఎఫ్ నిధులు రూ.56.20 లక్షలతో 13 పనులు
15 శాతం ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ నిధులు రూ.15 లక్షలతో 03 పనులు
6 శాతం ఎస్‌టీ ఈఎంఎఫ్ నిధులు రూ.47.60 లక్షలతో 06 పనులు
జెడ్పీ పాలనా అనుమతులు పొందిన పనుల వివరాలు..


