కర్నూలు(సెంట్రల్): చంద్రబాబు ప్రభుత్వంలో ఉద్యోగులకు వేధింపులు పారిపాటిగా మారాయని ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వీఆర్‌ఏ, వీఆర్వో విభాగం రాష్ట్ర అధ్యక్షుడు భూపతి రాజు రవీంద్రరాజు ఆవేదన వ్యక్తం చేశా రు. గురువారం కర్నూలు వచ్చిన ఆయన ఇటీవల పని ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్న వీఆర్వో టి.మహ్మద్‌హుస్సేన్ కుటుంబ సభ్యులను వారి ఇంట్లో పరామర్శించారు. హుస్సేన్ మరణానికి అధికారుల వేధింపులే కారణమని వారు చెప్పడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...టీడీపీ ప్రభుత్వంలో వీఆర్వోలపై దాడులు నిత్యకృత్యమమయన్నారు. ఉన్నతాధికారుల పని ఒత్తిడి కూడా పెరిగిపోయిందన్నారు. దీని కారణంగా చాలా మంది వీఆర్వోలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదనను వ్యక్తం చేశారు. వీఆర్వో టి.మహ్మద్ హుస్సేన్ కుటుంబానికి ఉద్యోగం, ఇంటి స్థలం ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. ఏపీ గవర్నమెంట్ ఎంప్లా యీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బంగిశ్రీధర్, సురేష్‌రెడ్డి, టౌన్ అధ్యక్ష,కార్యదర్శు లు మురళీధర్‌నాయుడు, చిన్న కృష్ణ పాల్గొన్నారు.


