గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికి ఏటా విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే ‘జగనన్న విద్యా కానుక’ కిట్లు అందించేవారు. ఇందులో మూడు జతల యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, బ్యాగులు, బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు తదితరవి ఉండేవి. ఇవన్నీ నాణ్యంగా ఉండేవి. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక పేరు మార్చి ‘సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర’ పేరుతో కిట్లు ఇచ్చింది. అయితే, నాణ్యతను విస్మరించడంతో విద్యా సంవత్సరం పూర్తికాకముందే చంద్రబాబు సర్కారు ఇచ్చిన వస్తువులు చిరిగిపోతున్నాయి. ఇందుకు ఈ చిత్రాలే నిదర్శనం. కొత్త ప్రభుత్వం వచ్చి రెండు విద్యా సంవత్సరాలు గడిచిపోయినా పిల్లల వీపులపై నేటికీ జగనన్న బ్యాగులే కనిపిస్తున్నాయి. దీనిని బట్టి పిల్లల చదువు, వారికి అందించే వస్తువులపై నాటి, నేటి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏ పాటిదో ఇట్టే అవగతమవుతుంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు
చెదరని నాణ్యత.. జగనన్న
బ్యాగులతో బడికి


