కొత్తపల్లి: సప్తనది సంగమ ప్రాంతంలో వెలసిన సంగమేశ్వరుడు జలాధివాసం వీడుతున్నాడు. 8 నెలలుగా కృష్ణాజలాల్లో ఆలయం ఉంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నీటి మట్టం 885 అడుగుల నుంచి 840 అడుగులకు చేరుకుంది. దీంతో గురువారం ప్రాచీన సంగమేశ్వరాలయ ప్రాంగణంలో మోకాలిలోతు నీరు ఉంది. మరో 2 రోజుల్లో ఆలయంలో నీరు పూర్తిగా పోతుందని ఆలయ పురోహితుడు తెలకపల్లి రఘురామశర్మ తెలిపారు. నీరు తగ్గడంతో ప్రాచీ న సంగమేశ్వర గర్భాలయ ద్వారానికి ఆలయ పురోహితుడు ఉగాది పర్వదినం సందర్భంగా మా మిడి తోర ణం కట్టారు. పక్కన ఉన్న దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. మోకాలిలోతులో ఉన్న వేపధారు శివలింగానికి కృష్ణాజలాలతో అభిషేకం నిర్వహించి, మంగళహారతి ఇచ్చారు. నీరు మొత్తం ఆలయం నుంచి పోయిన తర్వాత బురద తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని పురోహితులు చెప్పారు.


