
నాడు 85.. నేడు 40లోపు శాతం
ఈమె పేరు పద్మావతి. కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలోని బుధవారపేటలో నివాసం. జనవరి 1, 2011న సదరం క్యాంపునకు హాజరైంది. అప్పటి ఆర్థోపెడిక్ వైద్యులు పరీక్షించి 85 శాతం వైకల్యం ఉన్నట్లు నిర్ధారించి సదరం సర్టిఫికెట్ జారీ చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా ఈ ఏడాది మార్చి 6న రీ వెరిఫికేషన్ నిర్వహించారు. అయితే వికలత్వం 40 శాతంలోపే ఉన్నట్లు సర్టిఫికెట్ ఇవ్వడం చూస్తే ఈ ప్రక్రియ ఎంత గందరగోళంగా సాగుతుందో అర్థమవుతోంది. పోలియోతో ఒక కాలు పనిచేయని ఈమె వైకల్యం ఎలా తగ్గుతుందో వైద్యులకే తెలియాలి.