
అశోకుడి శిలాశాసనాల సందర్శన
తుగ్గలి : మండలంలోని జొన్నగిరి సమీపంలో అశోకుడి శిలాశాసనాలను ఫారెస్ట్ అడిషనల్ ప్రిన్సిపాల్ చీఫ్ కన్జర్వేటర్ చలపతిరావు శనివారం తన కుటుంబ సభ్యులతో సందర్శించారు. కర్నూలు నుంచి గుత్తికి వెళ్తూ మార్గ మధ్యలో జొన్నగిరి వద్ద అశోకుని శిలాశాసనాలను సందర్శించి శాసనాలను పరిశీలించారు. పెద్ద రాతి బండపై చెక్కిన శాసనాల గురించి ఆరా తీశారు. ఆయన వెంట ఇన్‌చార్జ్ డీఎఫ్‌ఓ విఘ్నేష్‌అప్పావు, స్క్వాడ్ డీఎఫ్‌వో రవి శంకర్, ఆదోని ఎఫ్‌ఆర్‌వో తేజస్వి, సిబ్బంది లక్ష్మన్న తదితరులు ఉన్నారు.