
వచ్చే నెల 13న అన్ని కోర్టుల్లో జాతీయ లోక్‌అదాలత్
కర్నూలు(సెంట్రల్): జిల్లాలోని అన్ని కోర్టుల్లో సెప్టెంబర్ 13వ తేదీన జాతీయ లోక్‌అదాలత్‌ను నిర్వహించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి ఆదేశించారు. బుధవారం జిల్లా న్యాయ సేవాసదన్‌లో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్‌పై పోలీసులు, రెవెన్యూ, బ్యాంకు అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోర్టుల్లో పెండింగ్‌లో ఉండి రాజీ కాగల్సిన సివిల్, క్రిమినల్, ఎకై ్సజ్, మోటార్ యాక్సిడెంట్, భూసేకరణ కేసులను జాతీయ లోక్‌అదాలత్‌లో త్వరగా పరిష్కరించుకోవచ్చన్నారు. ఆందులో ఎక్కువ కేసులు పరిష్కారయ్యేలా పోలీసులు, న్యాయవాదులు చూడాలని సూచించారు.