
ఓబులేసుకు పింఛన్ పాయె..
ఇక్కడ కుర్చీలో కూర్చున్న అంధుడు పేరు గుడిశ ఓబులేసు (గుడ్డి ఓబులేసు) ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల గ్రామానికి చెందిన ఇతను పుట్టుకతోనే అంధుడు. దీంతో పాటు శరీరంలోని మరి కొన్ని అవయవాలు కూడా సక్రమంగా పనిచేయక అనారోగ్యంతో ఉంటాడు. దీంతో 2004లో పింఛన్ మంజూరు చేయడం జరిగింది. అనంతరం సదరన్ క్యాంపులో వంద శాతం వైకల్యం ఉన్నట్లు సర్టిఫికెట్ మంజూరు చేయడంతో 6 సంవత్సరాల నుంచి దివ్యాంగ పింఛన్ పొందుతున్నాడు. అయితే గత మూడు రోజుల క్రితం ఇతనికి ఎలాంటి వైకల్యం లేదని పింఛన్ తొలగిస్తున్నట్లు నోటీసులు ఇవ్వడంతో కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులు సైతం ఆశ్చర్య పోతున్నారు. ఒంటరి వాడైన ఇతన్ని చూసుకునేందుకు ఇంటి దగ్గర ఉంటూ పింఛన్ సొమ్ముతో కాలం గడపుతున్నామని ఇప్పుడు ఎలా బతికేదని అతని తల్లి సుబ్బమ్మ ఆవేదన వ్యక్తం చేస్తోంది. – ఆళ్లగడ్డ