
22న డీఎన్‌కే అవగాహన సమావేశం
కర్నూలు(అర్బన్): కర్నూలు ప్రధాన తపాలా సూపరింటెండెంట్ కార్యాలయంలో ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు డాక్ ఘర్ నిర్యాత్ కేంద్ర్ (డీఎన్‌కే ) అవగాహన సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు కర్నూలు తపాలా అధికారి జీ జనార్దన్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాలకు సంబంధించిన వ్యాపారులకు సంబంధించి పోస్టల్ శాఖ అందిస్తున్న సేవలను ఈ సమావేశంలో వివరించనున్నట్లు చెప్పారు. విదేశాలకు తమ ఉత్పత్తులను/వస్తువులను ఎగుమతి చేయాలనుకునే చిన్న వ్యాపారులు, ఉత్పత్తిదారులు, ఐఈసీ హోల్డర్లకు ఇది ఒక మంచి అవకాశమన్నారు. సమావేశంలో ఎగుమతుల విధానాలను నిపుణులు వివరిస్తారన్నారు. మరిన్ని వివరాలకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ హెచ్ గరీబ్‌బాషాను 8919286405 నంబర్‌లో సంప్రదించాలన్నారు. పోస్ట్‌ప్యాక్ ద్వారా జిల్లా ప్రజలు తమ ఉత్పత్తులను ప్రధాన కార్యాలయంలో పార్సెల్ ప్యాకింగ్ చేసుకునే సౌకర్యం కూడా ఉందని ఆయన తెలిపారు.