
చెప్పుకోలేని వ్యథ
గతంలో అధికారులు ఇచ్చిన 55 శాతం అంగవైకల్యం సర్టిఫికెట్ చూపుతున్న వ్యక్తి పేరు మాల చిన్న తిమ్మప్ప. మండల కేంద్రం నందవరం సొంతూరు. పుట్టుకతోనే చెవిటి, మూగ. ఎవరు ఎమి మాట్లాడుతున్నారో అర్థం కాదు. వినిపించని పరిస్థితి. గతంలో ఇచ్చే దివ్యాంగుల పింఛన్ కూటమి ప్రభుత్వం ఇప్పుడు నిలిపేస్తామని నోటీసులు ఇవ్వడంతో ఆందోళన చెందుతున్నాడు. ప్రభుత్వం, అధికారులు అనుసరిస్తున్న తీరుపై మూగ సైగలతో ఆవేదన వ్యక్తం చేశాడు. రీ వెరిఫికేషన్‌లో తాత్కాలిక వైకల్యం ఉందని తొలగించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారని..తమలాంటి వారికి సాయం చేసి ఆదుకోవాలని కోరుతూ వేడుకున్నాడు. – నందవరం