
యాటకల్ బ్రిడ్జిని వెంటనే నిర్మించండి
కర్నూలు(సెంట్రల్): వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో యాటకల్లు సమీపంలో ఉన్న బ్రిడ్జి కూలిపోవడంతో 20 గ్రామాలకు మండల కేంద్రమైన ఆస్పరికి రాకపోకలు నిలిచిపోయాయని, వెంటనే చర్యలు తీసుకోవాలని ఆలూరు ఎమ్మెల్యే బి.విరూపాక్షి కలెక్టర్ పి.రంజిత్‌బాషాకు విన్నవించారు. మంగళవారం ఆయన కలెక్టర్‌ను ఆయన కార్యాలయంలో కలసి రోడ్డును యుద్ధ ప్రాతిపదికన నిర్మించాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..యాటకల్ బ్రిడ్జి కూలిపోవడంతో తంగరడోణ, తురువగల్లు, తోగలగళ్లు,దొడకొండ, కళ్లపరి, కై రు ప్పల, కారుమంచి తదితర గ్రామాల ప్రజలు మండల కేంద్రానికి రావడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నట్లు చెప్పారు. వెంటనే బ్రిడ్జిని నిర్మించాలని కలెక్టర్‌ను కోరానన్నారు.
నేటి నుంచి
పెద్దరాజుస్వామి ఉరుసు
బేతంచెర్ల: మతసామరస్యానికి ప్రతీకగా వెలసిన గూటుపల్లె పెద్దరాజు స్వామి దర్గా ఉరుసు బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో దర్గాను విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఉరుసు సందర్భంగా బుధవారం గంధం, గురు వారం ఉరుసు, శుక్రవారం జియారత్ వేడుకలు నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నట్లు దర్గా పీఠాధిపతి గురు సయ్యద్ అక్బర్ బాషా ఖాద్రి తెలిపారు.
డిప్లొమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
కర్నూలు(హాస్పిటల్): ఏపీ స్టేట్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ సర్వీసెస్ డిప్లొమా కోర్సులకు ఇంటర్‌మీడియట్ అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దర ఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కర్నూలు మెడికల్ కాలే జి ఇన్‌చార్జ్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ సాయిసుధీర్ మంగళవారం తెలిపారు. అభ్యర్థులు పూరించిన దరఖాస్తులను సెప్టెంబర్ 8వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు కర్నూలు మెడికల్ కాలేజిలో రూ.100 రుసుం చెల్లించి పేర్లను నమోదు చేసుకోవాలన్నా రు. దరఖాస్తులు apsahpc.in వెబ్‌సైట్‌లో లభిస్తాయన్నారు. సెప్టెంబర్ 19న కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. ఇంటర్ బైపీసీ చదివిన విద్యార్థులకు మొదటి ప్రాధాన్యత ఇస్తామన్నారు.
అమ్మకానికి పొట్టిరకం జొన్న సిద్ధం
నంద్యాల(అర్బన్): నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో ఎన్‌టీజే–5 పొట్టి రకమైన జొన్న అమ్మకానికి సిద్ధంగా ఉందని ఏడీఆర్ విల్సన్ మంగళవారం తెలిపారు. జిల్లాలో మాఘీ సీజన్ (సెప్టెంబర్ నుంచి లేట్ రబీ నవంబర్)కు ఈ రకాన్ని విత్తుకోవచ్చని చెప్పారు. ఈ రకం నాణ్యమైన విత్తనం 100 క్వింటాళ్లు (పునాది విత్తనం) అందుబాటులో ఉందని, కిలో రూ.90 ప్రకారం అమ్మకాలకు సిద్ధంగా ఉంచామన్నారు.

యాటకల్ బ్రిడ్జిని వెంటనే నిర్మించండి