
బెస్త కార్పొరేషన్ చైర్మన్‌ను తొలగించాలి
నంద్యాల(అర్బన్): నకిలీ సర్టిఫికెట్‌తో బెస్త కార్పొరేషన్ చైర్మన్ పదవి పొందిన బొమ్మన శ్రీధర్‌ను వెంటనే తొలగించాలని బెస్త సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షుడు రమణ, ఏపీ ఫిషర్‌మెన్ జేఏసీ చైర్మ న్ రాజశేఖర్ డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం స్థానిక ఉదయానంద్ ఫంక్షన్‌హాల్‌లో రాయలసీమ జిల్లాల వ్యాప్తంగా మత్స్యకార, బెస్త కులాలకు చెందిన నేతల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. సీమ జిల్లాల్లో బెస్తలు అధికంగా ఉన్నారని, అయితేకార్పొరేషన్ చైర్మన్ పదవిని బెస్త కులం కాని వారైన బొమ్మన శ్రీధర్‌కు ఇవ్వడం సమంజసం కాదన్నారు. ఇది బెస్త వర్గాలను మోసం చేయడమేనని మండిపడ్డారు. మత్స్య కులాల మధ్య చిచ్చు రేపేందుకే కూటమి ప్రభుత్వం ఇలాంటి చర్యలకు ఒడిగట్టిందన్నారు. వెంటనే శ్రీధర్‌ను తొలగించి బెస్త సంఘం నాయకులకు పదవి ఇవ్వాలని లేకుంటే భారీ ఎత్తున ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. జాతీయ మత్స్యకార సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అప్పలరాజు, బెస్త కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ గిరిబోయిన చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.