
విద్యార్థిని అదృశ్యం
సంజామల: మండల పరిధిలోని ముదిగేడు గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థిని అదృశ్యమైంది. ఎస్‌ఐ రమణయ్య తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కుంటి గోపాల్, లక్ష్మిదేవి దంపతుల కుమార్తె పవిత్ర సంజామల ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. సోమవారం వర్షం కారణంగా అధికారులు పాఠశాలకు సెలవు ప్రకటించారు. దీంతో బాలిక ఇంటి వద్దనే ఉంది. తల్లిదండ్రులు పశువులను మేపేందుకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చే సరికి బాలిక కనపడక పోవడంతో బంధువులు, స్నేహితుల వద్ద విచారించినా ఆచూకీ తెలియలేదు. దీంతో మంగళవారం పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్‌ఐ తెలిపారు.
కారు ఢీకొని
వ్యక్తికి గాయాలు
పాణ్యం: మండల కేంద్రంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒద్దరికి గాయాలైనట్లు హైవే పోలీసులు మంగళవారం తెలిపారు. వివరాలు.. కేఆర్‌ఆర్ తాండాకు చెందిన బాబునాయక్ వ్యక్తిగత పని నిమిత్తం బైక్‌పై పాణ్యంకు వెళ్లి తిరిగి వస్తుండగా తండా సమీపంలో వెనక వచ్చిన ఏపీ 39 జీఈ 1683 నంబర్ గల కారు ఢీకొట్టింది. ఈ కారు కరీంనగర్ నుంచి రాయచోటికి వెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాబునాయక్‌ను హైవే అంబులెన్స్‌లో నంద్యాలకు తరలించారు. అలాగే పాణ్యం ఫ్లైఓవర్‌పై సోమవారం అర్ధరాత్రి నంద్యాలకు చెందిన కారు బేతంచెర్ల నుంచి నంద్యాలకు వెళ్తుండగా కారు టైర్ బరస్టు కావడంతో అదుపుతప్పి బోల్తా పడిందన్నారు. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు క్షేమంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న హైవే పోలీసులు ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా వాహనాలను తొలగించారు.
పాము కాటుకు మహిళ మృతి
కౌతాళం: పాము కాటుకు మహిళ మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని అగసలదిన్నె గ్రామంలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గంగమ్మ (54) పశువులకు గడ్డి తీసుకొచ్చేందుకు గడ్డివాముకు పోతుండగా పాము కాటు వేసింది. గమనించిన కుటుంబ సభ్యులు స్థానికంగా చికిత్స చేయించి ఆదోనికి తరలించారు. చికిత్స పొందుతూ కోలుకోలేక ఆమె రాత్రి మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. మృతురాలికి భర్త హనుమేష్, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి..
మంత్రాలయం రూరల్: మండల కేంద్రానికి చెందిన ఎం.అబ్దుల్‌బాషా (48) గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందాడు. మంగళవారం పోలీసులు తెలిపిన వివరాలు ఇవి.. మంత్రాలయంకు చెందిన అబ్దుల్‌బాషా మూడేళ్లుగా మతిస్థిమితం లేక తిరుగుతుండేవాడు. డాక్టర్లకు చూపించినా వ్యాధి న యం కాలేదు. ఈ స్థితిలో సోమవారం రాత్రి ఇంటి వద్ద భోజనం చేసిన తరువాత మండలంలోని చిలకడోణ– కల్లుదేవకుంట గ్రామాల మధ్యలోని 167వ జాతీయ రహదారిలోని నారాయణరెడ్డి పొలం వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అబ్దుల్‌బాషా అక్కడిక్కడే మృత్యువాత పడ్డాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహాన్ని ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి కుమారుడు జాఫర్ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ శివాంజల్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు వెల్లడించారు.

విద్యార్థిని అదృశ్యం

విద్యార్థిని అదృశ్యం