
జాతీయ ఉత్తమ ఫొటోగ్రాఫర్‌గా డి.హుస్సేన్
కర్నూలు(సెంట్రల్): ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ఫొటో జర్నలిస్టు అసోసియేషన్ నిర్వహించిన కాంటెస్టులో కర్నూలు సాక్షి అసిస్టెంట్ చీఫ్ ఫొటోగ్రాఫర్ దూదేకుల హుస్సేన్ అచీవ్‌మెంట్ విభాగంలో జాతీయ స్థాయి ఉత్తమ ఫొటోగ్రాఫర్‌గా అవార్డు అందుకున్నారు. మంగళవారం విజయవాడలోని గాంధీనగర్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ అలపాటి సురేష్‌కుమార్, ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. డి.హుస్సేన్ ఇప్పటి వరకు 9 జాతీయ, 12 రాష్ట్ర స్థాయి ఉత్తమ ఫొటోగ్రాఫర్ అవార్డులు అందుకోవడం విశేషం.

జాతీయ ఉత్తమ ఫొటోగ్రాఫర్‌గా డి.హుస్సేన్