
అంబులెన్స్ డ్రైవర్ దుర్మరణం
● లారీ, అంబులెన్స్ ఢీకొనడంతో ప్రమాదం
గోనెగండ్ల: మండల కేంద్రం సమీపంలో భారత్ గ్యాస్ గోడౌన్ వద్ద మంగళవారం ఉదయం అంబులెన్స్, లారీ ఢీకొన్న ప్రమాదంలో ఎమ్మిగనూరుకు చెందిన అంబులెన్స్ డ్రైవర్ ఖతాల్ షేక్ హుసేన్ (30) మృతిచెందినట్లు సీఐ విజయభాస్కర్ తెలిపారు. వివరాలు.. ఎమ్మిగనూరుకు చెందిన ఖతాల్ షేక్ హుసేన్‌కు భార్య హసీనా ఉంది. హుసేన్ సొంతంగా అంబులెన్స్ వాహనం నడుపుతున్నాడు. ఎమ్మిగనూరులోని ప్రైవేట్ ఆస్పత్రుల నుంచి రోగులను కర్నూలు ఆస్పత్రులకు తరలించేవాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఎమ్మిగనూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి నుంచి రోగిని అంబులెన్స్ (ఏపీ 21 టీజెడ్ 6342)లో కర్నూలు ఆస్పత్రికి తీసుకెళ్లాడు. మంగళవారం తెల్లవారుజామున తిరిగి వస్తుండగా ఉదయం 6 గంటల సమయంలో గోనెగండ్లలోని భారత్ గ్యాస్ గోడౌన్ వద్ద ఎదురుగా ఉల్లి గడ్డల లోడ్‌తో కర్నూలుకు వెళుతున్న లారీ(ఎంహెచ్ 13 డీక్యూ 9693) ఢీకొట్టింది. ప్రమాదంలో అంబులెన్స్ నుజ్జునుజ్జుకాగా హుసేన్ తీవ్రగాయాలతో అందులోనే ఇరుక్కుపోయాడు. అటుగా వెళుతున్న ప్రయాణికులు హుసేన్‌ను బయటకు తీసి చికి త్స నిమిత్తం ఎమ్మిగనూరుకు తరలిస్తుండగా మా ర్గం మధ్యలోనే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచార ణ చేపట్టారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. లారీని పోలీసులు సీజ్ చేసి స్టేషన్‌కు తీసుకెళ్లారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

అంబులెన్స్ డ్రైవర్ దుర్మరణం