
90 శాతాన్ని 50కి తగ్గించారు
● మంచానికి పరిమితమైన 88 ఏళ్ల షేక్ అబ్దుల్‌గఫార్ పక్షవాతం బాధితుడు. బనగానపల్లె పట్టణం ఈద్గా నగర్‌లో నివాసముంటున్నాడు. 2014 నుంచి పక్షవాతంతో ఇతను మాట్లాడలేడు, జ్ఞాపక శక్తి కూడాలేదు. నంద్యాల సదరన్ క్యాంప్‌లో 2014 ఫిబ్రవరి 14న 90 శాతం వికలాంగుడిగా సర్టిఫికెట్ పొందారు. కూటమి ప్రభుత్వంలో ఏడాది రూ.15వేల పింఛన్ ఇచ్చారు. ఇటీవల జరిగిన సదరన్ క్యాంపులో వికలాంగుడిగా 50 శాతం మాత్రమే ఉన్నట్లు సచివాలయ అధికారులు అతనికి రెండు రోజుల క్రితం నోటీసు ఇచ్చారు. ఇక నుంచి రూ.6వేలు మాత్రమే పింఛన్ వస్తుందని చెప్పడంతో కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. కదలలేని స్థితిలో ఉన్న వృద్ధుడికి 50 శాతం మాత్రమే వికలత్వ సర్టిఫికెట్ ఇవ్వడంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.