
ప్రభుత్వానికి కనికరమేదీ?
● ఈ చిత్రంలో మంచంపై పిల్లాడిలా కనిపిస్తున్న దివ్యాంగుడు పేరు సూరపురెడ్డి వెంకటరమణారెడ్డి. స్వగ్రామం కొలిమిగుండ్ల మండలం రాఘవరాజుపల్లె. వయస్సు 34 ఏళ్లు. పుట్టుకతోనే దివ్యాంగుడు. మూడు పదుల వయసున్నా చిన్న పిల్లాడి తరహాలో చూసుకోవాల్సి వస్తుంది. రెండు కాళ్లు పూర్తిగా సహకరించవు. గతంలో సదరం క్యాంపుకు వెళ్లినపుడు 90 శాతం ఉన్నట్లు గుర్తించి సర్టిఫికెట్ ఇచ్చారు. ఆరు నెలల క్రితం ప్రభుత్వం రీవెరిఫికేషన్ నిర్వహించింది. ఇటీవల గ్రామ సచివాలయంలో ఇచ్చిన సర్టిఫికెట్‌లో 74 శాతం ఉన్నట్లు ఇచ్చారు. ఇది ఎంత వరకు సమంజసమని రమణారెడ్డి ప్రశ్నిస్తున్నాడు. 90 శాతం వైకల్యం ఉంటే రూ.15వేల పింఛన్ సొమ్ము ఇవ్వాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఆదిశగా లేకుండా ఏకంగా దివ్యాంగుల వైకల్యంలోనూ మార్పులు చేయడం గమనార్హం