
హాస్టళ్లలో ప్రవేశాన్ని నిషేధించడం నిరంకుశత్వం
వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి కటారు కొండ సాయికుమార్
కర్నూలు (టౌన్): స్కూల్స్, హాస్టళ్లు, కళాశాలల్లో విద్యార్థి సంఘాల ప్రవేశాన్ని నిషేధించడం కూటమి ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి కటారు కొండ సాయి కుమార్ అన్నారు. వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం కర్నూలు పాతబస్టాండ్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. జీవో ప్రతులను ద హనం చేశారు. ఈ సందర్భంగా సాయి కుమార్ మా ట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికై నా జీవోను రద్దు చేయాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామన్నా రు.స్కూళ్లు, హాస్టళ్లు సమస్యలతో సతమతమవుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం నాయకులు బబ్లు, చి న్నరాజు,మహేష్,వేణు,రాజుతదితరులు పాల్గొన్నారు.