
యువకుడి ఆత్మహత్య
ఎమ్మిగనూరురూరల్: పట్టణంలోని సోమప్ప నగర్‌లో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదోనికి చెందిన ఈరన్న, రాజేశ్వరి దంపతులు పదేళ్ల క్రితం ఎమ్మిగనూరుకు వలస వచ్చి సోమప్ప నగర్‌లో నివాసముంటున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఈరన్న గౌండ పని చేస్తుండగా, రాజేశ్వరి పెళ్లిళ్ల లో వంట పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నా రు. కుమార్తెలకు వివాహాలు అయ్యాయి. కుమారుడు లలిత్‌కుమార్ (19) ఆదోని భీమా ఇంజినీరింగ్ కాలేజీలో రెండో సంవత్సరం చదువుతూ మధ్యలోనే మానేసి కారు మెకానిక్‌గా పని చేస్తున్నాడు. కాగా కొన్ని రోజులుగా మద్యానికి బానిసై పనికి వెళ్లడం లేదు. అయితే ఏమి జరిగిందో తెలియది కానీ ఆదివారం రాత్రి ఇంట్లో భోజనం చేసి గదిలోకి వెళ్లి తలుపు వేసుకుని పడుకున్నాడు. సోమవారం ఉదయం ఎంతకీ తలుపులు తీయకపోవటంతో కుటుంబీకులు అనుమానంతో కిటికీలోంచి చూడగా ఉరేసుకుని కనిపించాడు. తలుపులు బద్దలుకొట్టి కిందకు దించి ఆసుపత్రికి తరలించారు. కాగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కుమారుడి ఆత్మహత్యతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతుడి తండ్రి ఈరన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ సీఐ వి. శ్రీనివాసులు తెలిపారు.
హెల్మెట్ లేకుంటే
రూ.వెయ్యి జరిమానా
రూ.1.50 లక్షల అపరాధ రుసుం
కర్నూలు: హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనంపై రోడ్డెక్కితే ఇక జేబుకు చిల్లే. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్ ఆధ్వర్యంలో సోమవారం నగరంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. వాహన రికార్డులు లేకపోయినా, హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారిని అడ్డగించి భారీగా జరిమానాలు విధించారు. దాదాపు 150 మంది హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడుపుతూ పోలీసుల తనిఖీల్లో పట్టుబడగా ఒక్కొక్కరికి రూ.వెయ్యి చొప్పు న రూ.1.50 లక్షల అపరాధ రుసుం విధించారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న వ్యక్తులను ఆపి అరగంట పాటు సమయమిచ్చి హెల్మెట్ తెచ్చుకున్న తర్వాత వారికి రోజా పుష్పం ఇచ్చి వాహనాలను అప్పగించారు. ఇకపై హెల్మెట్ లేకుండా నడిపే వ్యక్తులను ఉపేక్షించేది లేదని సీఐ మన్సూరుద్దీన్ హెచ్చరించారు.
జీవితంపై విరక్తి చెంది..
గడివేముల: పెసరవాయి గ్రామానికి చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ నాగార్జున రెడ్డి తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన బెలుం గాయత్రి (30) తెలంగాణ రాష్ట్రం నల్గొండలో కెనరా బ్యాంక్‌లో ఫీల్డ్ ఆఫీసర్‌గా పనిచేస్తుంది. కొన్ని రోజుల నుంచి పెళ్లి సంబంధాలు కుదరకపోవడంతో మానసికంగా బాధపడుతూ సోమవా రం ఉదయం పెసర వాయి గ్రామంలో ఉరివేసుకుంది. కుటుంబ సభ్యులు గమనించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుంచగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. మృతు రాలి తల్లి లక్ష్మీ నాగేశ్వరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు.

యువకుడి ఆత్మహత్య