
భళా.. కర్ణ
యూరియా కోసం రైతుల ఆందోళన
కౌతాళం: యూరియా కోసం నెల క్రితం డబ్బులు చెల్లించినా ఇవ్వకపోవడంతో రైతులు సోమవారం టోకెన్లు చూపిస్తూ ఆందోళన నిర్వహించారు. సహకార పరపతి సంఘానికి ఐదు లోడ్లలో 1400 వందల సంచులు యూరియా వచ్చింది. డబ్బులు తీసుకుని టోకన్లు ఇచ్చిన రైతులకు కాదని మిగితా రైతులకు ఆధార్‌కార్డు తీసుకుని రెండు సంచుల ప్రకారం యూరియా ఇస్తున్నారు. ఇదేమని వ్యవసాయాధికారిని ప్రశ్నించగా ‘మీకు ఐదు నుంచి పది సంచుల వరకు ఇచ్చేది ఉంది. మిగిలితే ఇస్తాం’ అని సమాధానం ఇచాచరు. దీంతో టోకన్లు ఉన్న రైతులు ఆందోళనకు దిగారు. తమ కళ్ల ముందే యూరియా నాయకులకు, భూస్వాములకు ఇస్తున్నారని రైతులు ఖాదరయ్య, నర్సయ్య, వీరేష్, లింగన్న, సుకేంద్ర, గొట్టయ్య, రామచంద్ర, వెంకన్న ఆరోపించారు. యూరియా ఇస్తామని చెప్పడంతో పొలాలకు వెళ్లకుండా ఉదయం నుంచి సహకార పరపతి సంఘం వద్ద వేచి ఉన్నా వ్యవసాయాధికారి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నడని, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కోసిగి: గుండెత్తు పోటీల్లో కర్ణాటకకు చెందిన కప్పగల్ కర్ణ సత్తా చాటాడు. ఉరుకుంద ఈరన్న స్వామి పల్లకోత్సవం సందర్భంగా సోమవారం కందు కూరులో గుండెత్తుట, ఇసుక సంచి ఎత్తుట, పరుగు పందెం, ట్రిపుట్ జంప్ పోటీలు నిర్వహించారు. ఇందులో 175 కేజీల గుండును కర్ణాటక రాష్ట్రానికి చెందిన కప్పగల్ కర్ణ అనే వ్యక్తి మూడు సార్లు అవలీలగా ఎత్తి ప్రథమ బహుమతి గెలుపొందారు. వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి పి. మురళీ మోహన్ రెడ్డి రూ.5100 నగదును అందజేశారు. శారదళ్లి సక్కీరప్ప అనే వ్యక్తి రెండు సార్లు ఎత్తి ద్వితీయ బహుమతి గెలుపొందగా ఈయనకు వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ బెట్టన గౌడ రూ.5000ను అందించారు. అలాగే 220 కేజీల ఇసుక సంచి మడినాళ్ల ఎళ్లలింగా అనే వ్యక్తి ఎత్తి ప్రథమ స్థానంలో నిలిచాడు. ఈయనకు టీడీపీ ఇన్‌చార్జ్ రాఘవేంద్ర రెడ్డి రూ.7,100 నగదును అందించారు. ద్వితీయ స్థానంలో నిలిచిన శారదళ్లి మరియప్పకు రూ.4100 ముత్తురెడ్డి అందజేశారు. 5 కిలో మీటర్లు పరుగు పందెం పోటీల్లో పెద్దతుంబళం ఈరన్న, తిమ్మప్ప ద్వితీయ ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారు.

భళా.. కర్ణ