
వంద పడకల ఆసుపత్రికి తాళం
ఎమ్మిగనూరుటౌన్: పట్టణంలోని వంద పడకల ఏరియా ఆస్పత్రి ప్రారంభించిన మూడు నెలలకే మూతపడింది. ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల రోగులకు వైద్య సేవలు అందడం లేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నిధులు మంజురు చేయగా నిర్మాణ పనులు చివరి దశలో కేవలం అయిదు శాతం ఉండగా ఎన్నికల కారణంగా నిలిచిపోయాయి. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆయా పనులు పూర్తి చేసి ఎంతో అట్టహాసంగా మే నెల 20వ తేదీ వంద పడకల ఏరియా ఆస్పత్రి భవన సముదాయాన్ని ప్రారంభించింది. అయితే ఆస్పత్రి ఆదివారం మూత పడింది. ఆస్పత్రికి భవనానికి రెండు వైపుల తాళం వేసి ఉంచారు. దీంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పాత ఆస్పత్రిలోనే వైద్య సేవలు అందుకున్నారు.