
మంత్రాలయంలో జిల్లా న్యాయమూర్తులు
మంత్రాలయం రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రమైన మంత్రాలయంలో శ్రీరాఘవేంద్రస్వామిని ఆదివారం జిల్లా జడ్జి కబర్ది, ఆదోని రెండవ ఆదనపు జిల్లా జడ్జి సుధ, ఆదోని సబ్ జడ్జి నారాయణ దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు, ఆలయ సిబ్బంది స్వాగతం పలికి స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేయించారు. న్యాయమూర్తులకు పూలమాల శాలువతో సన్మానించి తీర్థప్రసాదాలను అందజేశారు. అంతకు ముందు మంచాలమ్మ అమ్మ వారిని దర్శించుకుని పూజలు చేశారు.
ఉరుకుందలో..
కౌతాళం: ఉరుకుంద ఈరన్నస్వామిని ఆదివారం జిల్లా జడ్జి కబర్ది, ఆదోని రెండో ఆదనపు జిల్లా జడ్జి సుధ, ఆదోని సబ్ జడ్జి నారాయణ దర్శించుకున్నారు. వీరికి ఆలయ డిప్యూటీ కమిషనర్ వాణి, అర్చకులు, ఆలయ సిబ్బంది స్వాగతం పలికారు. స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేయించి న్యాయమూర్తులకు పూలమాలలు, శాలువతో సన్మానించి తీర్థప్రసాదాలను అందజేశారు. శ్రావణమాస ఉత్సవాలపై ఈఓ వాణిని అడిగి జిల్లా న్యా యమూర్తులు తెలుసుకున్నారు.