
మాల ఉద్యోగుల ఐక్యతే మాల్గోవ ధ్యేయం
కర్నూలు(అర్బన్): మాల ఉద్యోగుల ఐక్యతే ధ్యేయంగా మాల గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (మాల్గోవ ) పనిచేస్తుందని మాల్గోవ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విజయానంద్, రామకృష్ణ అన్నారు. ఆదివారం రాత్రి స్థానిక జెడ్పీలోని ఎంపీపీ హాల్‌లో మాల గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గం ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాల ఉద్యోగులకు మాల్గోవ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గోన నాగరాజు, అడిషనల్ సెక్రెటరీ హెచ్‌డీ ఈరన్న , అరవింద్, ఉమామహేశ్వర్ పాల్గొన్నారు.
ఏకగ్రీవంగా జిల్లా నూతన కార్యవర్గం ....
మాల్గోవ జిల్లా అధ్యక్షుడిగా వీపీ సోమన్న, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ వై రాజశేఖర్, కోశాధికారిగా రాము డు, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడిగా నాగన్న, సుధాకర్‌బాబు, డాక్టర్ సృజన్, డాక్టర్ రాజేష్, అడిషనల్ జనరల్ సెక్రెటరీలుగా ఓబులేసు, పుల్లయ్య, సంయుక్త కార్యదర్శిగా మైలా బాబు రాజేంద్రప్రసాద్, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా వీరేష్, నారాయణ, మహిళా వింగ్ కార్యదర్శులుగా సుష్మ, జ్యోతి, విజయకుమారి, లీగల్ అడ్వైజర్‌గా జయరాజ్, గౌరవ సలహాదారులుగా రిటైర్డు డీఎస్‌పీలు దేవదానం, వేల్పుల జయచంద్ర, రిటైర్డు ఈఈ రాగప్ప, గౌరవాధ్యక్షుడిగా పాండురంగయ్య, చిరంజీవిని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం నూతనంగా ఎన్నికై న వారిని సభ్యులను సన్మానించారు.
జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా
వైపీ సోమన్న, డా.వై రాజశేఖర్