
రైళ్లు ఆగిపోయేవట
బ్రిటిష్ కాలంలో గుంటూరు– గుంతకల్ రైల్వే లైన్ ఏర్పాటు చేశాక వచ్చి పోయే రైళ్లు, గూడ్స్ బండ్లు ఆగిపోయేవట. ఏమి చేయాలో తోచక సిబ్బంది ఉన్నతాధికార్లకు సమాచారం ఇవ్వడంతో ఇక్కడకు వచ్చి ఆలయాన్ని సందర్శించి కృష్ణమ కోన పేరు మీదుగా స్టేషన్ ఏర్పాటు చేసినట్లు మా పెద్దలు చెప్పేవారు.
– రామసుబ్బయ్య, సిమెంట్ నగర్ గ్రామం
స్వామి వారు భక్తుల కల్పతరువు. సంతాన వర ప్రదాయుడిగా ఖ్యాతి పొందారు. ఎంతో విశిష్టత ఉన్న ఆలయాన్ని దర్శిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని నమ్మకం భక్తుల్లో ఉంది. పండుగ పర్వదినాలు శనివారం రుక్మిణి, సత్యభామ సమేత కృష్ణుడిని దర్శించుకుంటారు. సంతానం లేని వారు స్వామి వారిని సేవిస్తే ఫలితం ఉంటుంది.
– ఆలయ పూజారి కిట్టన్న

రైళ్లు ఆగిపోయేవట