
ఆనాటి హృదయాల ఆనంద గీతం
కల్లూరు: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 25 ఏళ్ల తర్వాత వారు ఒక చోటికి చేరారు. చిన్నప్పుడు తమ పాఠశాల అందించిన అనుభవాలను గుర్తు చేస్తున్నారు. అప్పటి విద్యాబోధనపై ముచ్చటించుకున్నారు. బాల్యం జ్ఞాపకాల్లో మునిగి తేలారు. కల్లూరు మండలం పర్ల గ్రామ జెడ్పీ హైస్కూల్‌లో 1999–200 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆ విద్యా సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసిన 75 మంది విద్యార్థుల్లో పలువురు ఉన్నత చదువులు చదివి దేశ, విదేశాల్లోని వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. వారంతా ఆత్మీయ సమావేశానికి హాజరై అప్పట్లో చదువు చెప్పిన గురువులు రిటైర్డ్ హెచ్‌ఎం చంద్రశేఖర్‌రెడ్డి, ఉపాధ్యాయులు చిన్నయ్య, ద్వారకనాథ శాస్త్రి, మీనాక్షినాయుడు, తైమూర్ బాషా, సంపత్, జి. నగేష్, అన్వర్ బాషా, గోదాదేవి, కల్పన, జ్యోతితో పాటు ప్రస్తుత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణను మెమోంటోలు అందజేసి శాలువ కప్పి సత్కరించారు. నాడు వారు బోధించిన చదువు, క్రమశిక్షణతోనే ఉన్నత శిఖరాలను అధిరోహించామని చెబుతూ పాదాభివందనం చేశారు. విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాలకు ఎప్పుడూ తమవంత సహాయ సహకారాలు అందజేస్తామని ప్రకటించారు.

ఆనాటి హృదయాల ఆనంద గీతం