
నీటి కష్టాలు
ఓ వైపు భారీ వర్షాలు కురుస్తున్నాయి.. వంకలు, వాగులు పొర్లుతున్నాయి. అయినా.. ఆస్పరి మండలం ములుగుందం గ్రామంలో మంచినీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వారంలో రెండు సార్లు మాత్రమే బోరు నీటిని సరఫరా చేస్తున్నారు. బోరు చెడిపోయినా, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినా నీటి కోసం ట్యాంక్‌లు, కుళాయిల వద్ద కుస్తీలు పట్టక తప్పని పరిస్థితి. కొందరు వ్యవసాయ బోర్లను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు నీటి సమస్యకు పరిష్కారం చూపాలని గ్రామస్తులు ఈరన్న, మారెన్న, లక్ష్మన్న తదితరులు కోరారు.
– ఆలూరు