ప్లాస్టిక్ కాలుష్యంతో అనారోగ్యం
కర్నూలు(సెంట్రల్): సమాజంలో ప్రతి ఒక్కరూ పర్యావరణంపై ప్లాస్టిక్ కాలుష్య ప్రభావాన్ని తగ్గించేందుకు సిద్ధమవ్వాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ముద్రించిన వాల్ పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణానికి ప్లాస్టిక్ పెనుభూతమై కూర్చుందన్నారు. ప్లాస్టిక్‌ను నిర్మూలించకపోతే భవిష్యత్ తరాలు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో జేసీ డాక్టర్ బి.నవ్య, డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, పీసీబీ ఈఈ కిషోర్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.
30 వరకు మలేరియా నివారణ మాసోత్సవాలు
మలేరియా నివారణ మాసోత్సవాలను ఈనెల 30వ తేదీ వరకు నిర్వహించాలని కలెక్టర్ పి.రంజిత్‌బాషా అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో మలేరియా నివారణ మాసోత్సవాలపై ముద్రించిన పోస్టర్లను ఆవిష్కరించారు.


