పీఎం జాతీయ బాల పురస్కార్‌కు కర్నూలు క్రీడాకారిణి
కర్నూలు(టౌన్): ప్రధానమంత్రి జాతీయ బాల పురస్కార్‌కు మద్దికెర మండలానికి చెందిన పారా అథ్లెట్ శివాని ఎంపికై ంది. ఈనెల 26న న్యూఢిలీలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆమె ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందుకోనుంది. పారా అథ్లెటిక్స్‌లో జావెలిన్ త్రో క్రీడాంశంలో గత నాలుగు సంవత్సరాలుగా పారా అథ్లెటిక్స్‌లో జావెలిన్ త్రో, షాట్ పుట్ విభాగాల్లో విశేషంగా ప్రతిభ చాటారు. ఈ విషయాన్ని పారా అథ్లెట్‌కు శిక్షణ, పునరావాసం, మార్గదర్శనం, పోటీ అవకాశాలు కల్పించిన ఆదిత్య మెహతా ఫౌండేషన్ సోమవారం ఒక ప్రకటనలో తెలియజేసింది.
ఆస్తులు రాయించుకుని
జీవనాధారం లేకుండా చేశారు
కర్నూలు: ‘నాకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె సంతానం. అందరూ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. ఆస్తులు రాయించుకొని నాకు ఎలాంటి జీవనాధారం లేకుండా చేయడమే కాక బాగోగులు కూడా చూసుకోవడం లేదు. విచారణ జరిపి తగు న్యాయం చేయాలి’ అని ఎమ్మిగనూరుకు చెందిన యల్లప్ప ఎస్పీ విక్రాంత్ పాటిల్‌కు ఫిర్యాదు చేశారు. కర్నూలు రెండో పట్టణ పోలీస్‌స్టేషన్ పక్కనున్న క్యాంప్ కార్యాలయంలో ఎస్పీ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి వినతులను స్వీకరించి నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పీజీఆర్‌ఎస్‌కు మొత్తం 84 ఫిర్యాదులు వచ్చాయి. వాటన్నింటిపై చట్ట పరిధిలో విచారణ జరిపి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని ఎస్పీ హామీ ఇచ్చారు. సీఐలు శివశంకర్, రమేష్, విజయలక్ష్మి తదితరులు కూడా పీజీఆర్‌ఎస్‌లో పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.
ఒకే గ్రామం నుంచి
50 కుటుంబాల వలస
కౌతాళం: మండలంలోని ఓబుళాపురం గ్రామం నుంచి సోమవారం 50 కుటుంబాలు హైదరాబాద్, గుంటూరు, బెంగళూరు నగరాలకు తరలివెళ్లాయి. ఉపాధి పనులు కల్పించడంలో అధికారులు విఫలం కావడంతో వల సలు తప్పడం లేదని గ్రామస్తులు రాము, మారెయ్య, పలువురు తెలిపారు. వ్యవసాయంలో ఈ ఏడాది పూర్తిగా నష్టపోయామని, పెట్టుబడుల కోసం అప్పులు చేశామని ఈరన్న అనే రైతు తెలిపారు. అప్పులు తీర్చాలంటే వలస వెళ్లడం తప్పడం లేదన్నారు.
పీఎం జాతీయ బాల పురస్కార్‌కు కర్నూలు క్రీడాకారిణి
పీఎం జాతీయ బాల పురస్కార్‌కు కర్నూలు క్రీడాకారిణి


