ప్రతి అర్జీని రిజిస్ట్రేషన్ చేయాలి
కర్నూలు(సెంట్రల్): పీజీఆర్‌ఎస్‌కు సంబంధించి మండల స్థాయిలో వచ్చిన ప్రతి అర్జీని రిజిస్ట్రేషన్ చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి తహసీల్దార్లు, ఎంపీడీఓలను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలు నుంచి పీజీఆర్‌ఎస్, హౌసింగ్, తాగునీటి అంశాలపై జిల్లా అధికారులు, మండలాల ప్రత్యేకాధికారులు, డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత సోమవారం మండల స్థాయిలో రిజిస్ట్రేషన్‌లు పూర్తి తక్కువగా ఎందుకున్నాయని తహసీల్దార్లను ప్రశ్నించారు. గోనెగండ్ల, సీబెళగల్, ఓర్వకల్ మండలాల్లో రీసర్వేకు సంబంధించిన అర్జీలు ఎక్కువగా పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని గడువులోపు పూర్తి చేయాలన్నారు. అలాగే ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని, వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సంతృప్తి చెందేలా పరిష్కరాలు చూపాలి
అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ డాక్టర్ ఉ.సిరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. జేసీ నూరుల్ ఖమర్, డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, హౌసింగ్ అధికారి చిరంజీవి పాల్గొన్నారు.
ప్రతి అర్జీని రిజిస్ట్రేషన్ చేయాలి


