ఆగస్టు చివరికి సారా రహిత జిల్లాగా చేయాలి
కర్నూలు: నవోదయం 2.0 కార్యక్రమం అమలులో భాగంగా కర్నూలు జిల్లాను ఆగస్టు చివరి నాటికి నాటుసారా రహిత జిల్లాగా ప్రకటించేలా పనిచేయాలని జిల్లా ఎకై ్సజ్ అధికారులను ఆ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ ఆదేశించారు. విజయవాడ నుంచి బుధవారం రాత్రి కర్నూలు చేరుకున్న రాహుల్ దేవ్ శర్మ బీ.క్యాంప్‌లోని పోలీస్ గెస్ట్ హౌస్‌లో బస చేశారు. గురువారం ఉదయం 10:30 గంటలకు స్థానిక ఎకై ్సజ్ కార్యాలయానికి చేరుకున్నారు. నోడల్ డిప్యూటీ కమిషనర్ పి.శ్రీదేవి, అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు, జిల్లా నోడల్ ఎకై ్సజ్ అధికారి సుధీర్ బాబు, ఏఈఎస్‌లు రాజశేఖర్ గౌడ్, రామకృష్ణారెడ్డి, సీఐలు రాజేంద్రప్రసాద్, చంద్రహాస్, జయరాం నాయుడు తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం డీటీఎఫ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నవోదయం 2.0 అమలు తీరు, జిల్లాలో ఉద్యోగుల పనితీరుపై సమీక్షించారు. జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ నుంచి బార్డర్ చెక్‌పోస్టుల పనితీరును సమీక్షించారు. చెక్‌పోస్టులలో నిఘాను పెంచి అక్రమ మద్యం జిల్లాలోకి రాకుండా అడ్డుకట్ట వేయాలన్నారు. రీజనల్ ఎకై ్సజ్ ల్యాబ్‌ను, అందులోని పరికరాలను పరిశీలించి ల్యాబ్ పనితీరును సమీక్షించారు. రిపోర్టులు తయారైన వెంటనే సంబంధిత స్టేషన్లకు స్పెషల్ మెసెంజర్ల ద్వారా పంపాలన్నారు. జిల్లా కార్యాలయం ఆవరణం మొత్తం కలియదిరిగి ఎకై ్సజ్ కార్యాలయ ఆవరణంలో మొక్కలు నాటారు. అనంతరం మాదవరం, ఛత్రగుడి చెక్‌పోస్టులను తనిఖీ చేశారు.
ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్
రాహుల్ దేవ్ శర్మ


